ఇలా చేస్తే దోమలు, ఈగలు రమ్మన్నా రావు....

శుక్రవారం, 24 నవంబరు 2017 (22:28 IST)
వర్షాకాలం, చలికాలంలో ఈగలు దోమలు బాధ ఎక్కువగా ఉంటుంది. వీటిని నివారించడానికి అనేక మందులను ఉపయోగిస్తాము. వీటివలన మన ఆరోగ్యం పాడైపోతుంది. అందువల్ల ప్రకృతి సహజమైన పద్ధతులను పాటించాలి. డైనింగ్ టేబుల్ మధ్యలో పూదీన ఆకులను ఉంచండి. దీని వాసనకు ఈగలు, దోమలు పారిపోతాయి. 
 
అంతేకాదు ఇంటిని శుభ్రవరిచేటప్పుడు నీళ్ళలో చెంచాడు పసుపు కలిపి శుభ్రం చేస్తే ఇంట్లోకి ఈగలు రాకుండా ఉంటాయి. ఇతర క్రిమికీటకాలు కూడా నశిస్తాయి. రోజు దోమలని తరమడానికి మస్కిటో మాట్ల అవసరం లేకుండా కమలా ఫలం తొక్కలను ఎండబెట్టి కాల్చితే వచ్చే పొగకు దోమలు పారిపోతాయి.
 
మన ఇంట్లో వాడుకునే వెల్లుల్లిపాయలను రోజుకు రెండు రేకులను కాల్చితే చాలు దోమలు రమ్మన్నా రావు. అంతేకాదు బెడ్రూమ్‌లో ఒక పాత్రలో నీళ్ళు పోసి అందులో కర్పూరపు బిళ్ళులు వేసి పెట్టండి. అరటి, మామిడి తొక్కలను, వేపాకులను ఎండబెట్టి వాటిని కాల్చితే వచ్చే పొగకు దోమలు రాకుండా ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు