శరీరంలో క్రొవ్వు కరిగించాలా.. అయితే ఇలా చేయండి..!

సోమవారం, 6 మార్చి 2017 (13:58 IST)
రాత్రి వేడి నీళ్లలో ఈ పొడి కలుపుకుని తాగితే 3 నెలల్లో శరీరంలో వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గుతారు..
 
కావల్సినవి.. 250 గ్రాముల మెంతులు, 100 గ్రాముల వాము, 50 గ్రాముల నల్ల జిలకర
 
తయారీ విధానం:
ముందుగా 3 పదార్థాలను రాళ్లు, మట్టి వంటివి లేకుండా శుభ్రం చేసుకోవాలి. వేరు వేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయాలి. మెంతులు, వాము, నల్ల జిలకర కలిపి పొడిగా చేసుకోవాలి. గాలి పోయే వీలులేని సీసాలో నిల్వ చేసుకోవాలి.
 
కింది విధంగా వాడాలి : 
రోజూ రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్లలో 1 స్పూన్ చూర్ణం (పొడి)ని కలిపి తాగాలి. ఆ తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు. రోజూ ఈ పొడిని తాగితే శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వస్తాయి. క్రమం తప్పకుండా 40-50 రోజులు తీసుకున్న తర్వాత గొప్ప ఫలితాలు అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. 3 నెలలు వాడితే మీ ఆరోగ్యానికి ఇక తిరుగు ఉండదు. ఈ పొడి వాడిన తర్వాత శరీరంలోని అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రక్తం శుభ్రపడుతుంది. శరీరంలో మంచి రక్తం ప్రవహిస్తుంది. శరీరంపై ఉన్న ముడతలుపోయి. శరీరంలో యవ్వనత్వం సంతరించుకుంటుంది. శరీరం బలంగా, చురుకుగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.
 
ప్రయోజనాలెన్నో... 
* కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. 
* ఎముకలు బలంగా తయారవుతాయి. 
* కంటి చూపు మెరుగవుతుంది.
* జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.
* మల బద్దకం శాశ్వతంగా దూరమవుతుంది. మోషన్ సాఫీగా అవుతుంది.
* రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది.
* దీర్ఘ కాలిక దగ్గు పోతుంది.
* గుండె పనితీరు మెరుగవుతుంది.
* మెదడు చురుగ్గా మారుతుంది. వినికిడి పెరుగుతుంది.
* రోజువారీ పనుల్లో చెలాకీగా పాల్గొంటారు.
* గతంలో తీసుకున్న ఇంగ్లిష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ను ఇది క్లియర్ చేస్తుంది.
* పళ్లు చిగుళ్లు బలంగా, ఆరోగ్యంగా మారతాయి.
* షుగర్ నియంత్రణలోకి వస్తుంది.
* గ్యాప్ లేకుండా 3 నెలలు ఈ చూర్ణం వాడిన వారు అద్భుత ఫలితాల కోసం మళ్లీ వాడాలనుకుంటే 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ 3 నెలలు వాడుకోవచ్చు.
* ఇలా చేస్తే శరీరంలోని క్రొవ్వు కరగడం మీకే తెలుస్తుందట. 

వెబ్దునియా పై చదవండి