వంటిట్లో ఆవాలుల లేని ఇళ్ళు తెలుగునాట ఉండదంటే అతిశయోక్తి కాదు. తాళింపు పెట్టాలంటే ఆవాలు ఉండాలి. ఆవాలు సువాసనా ద్రవ్యమే కాదు ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన దివ్యమైన ఔషధం. ముఖ్యంగా ఆవాలు స్త్రీలకు సంబంధించిన రోగాలలో, పలు సమస్యలతో అత్యద్భుతంగా పనిచేస్తుంది ఆవాలతో ఎన్నో ఉపయోగాలున్నా వాటిని కేవలం తాళింపుకే పరిమితం చేసే వాళ్లే ఎక్కువమంది ఆవాల గురించి అవగాహన లేకపోవడమే దీనికి కారణం.
ఆవాలలో రకాలు ఉన్నాయి. అవి తెల్ల ఆవాలు, ఎర్రావాలు, సన్న ఆవాలు, పెద్ద ఆవాలు అని ఆవాలు ఎలాంటివైనా వాటి ఔషధగుణాలలో పెద్దగా మార్పు ఉండదు. తెల్ల ఆవాలను కొన్ని రకాల జబ్బులలో ప్రత్యేకించి వాడతారు.
ఆయాసం, ఉబ్బసం వ్యాధిని ఆవాలు తగ్గిస్తాయి. రేచీకటి వ్యాధిలో కూడా ఆవాలు బాగా పనిచేస్తాయి. అయితే ఇతర నేత్రరోగాలలో, చత్వారమున్నప్పుడూ ఆవాలు నేత్రాలకు చెరుపు చేస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.