అధిక బరువును తగ్గించే బార్లీ, బఠాణీలు..

ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (15:01 IST)
అధిక బరువును తగ్గించుకోవాలంటే.. పచ్చి బఠాణీలు, బార్లీ గింజలను డైట్‌లో చేర్చుకోవాలి. బార్లీ గింజల్లో పీచు పుష్కలంగా వుంది. బార్లీ గింజలు పేగుల్లో వుండే మలినాలను తొలగిస్తాయి. కేన్సర్‌ను నియంత్రిస్తాయి. బార్లీ గింజలను తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా వుంటాయి. బార్లీని తీసుకుంటే కీళ్లనొప్పులు దూరమవుతాయి. 
 
బార్లీ గింజలను మెత్తగా ఉడికించాక ఆ నీటిని వడగట్టి అర గ్లాసుడు ఆరెంజ్ జ్యూస్ నిమ్మరసం కలిపి తీసుకుంటే బరువు తగ్గొచ్చు. ప్రతిరోజూ సూప్, సలాడ్‌తో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
 
బార్లీ గింజలు వృద్ధాప్య ఛాయలు తగ్గించే యాంటీఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయి. చర్మానికి ఇవి మెరుపు తీసుకొస్తాయి. అలాగే బఠాణీలు కూడా బరువు తగ్గిస్తాయి. పచ్చిబఠాణీల్లో పీచు మెండుగా వున్నందున జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కంటిచూపును మెరుగుపరచడంలో పచ్చి బఠాణీల్లో ఉండే విటమిన్‌-ఎ సహాయపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు