వంకాయ ఆకుల రసంలో తేనెను కలుపుకుని తీసుకుంటే?

శనివారం, 11 ఆగస్టు 2018 (10:31 IST)
వంకాయలో పోషకాలు, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వంకాయను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిన్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. షుగర్ వ్యాధులతో బాధపడేవారికి ఎంతో సహాయపడుతుంది.
 
వంకాయ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ కె శరీరంలో బ్లడ్ క్లాట్స్‌ను ఏర్పడకుండా నిరోధిస్తుంది. వంకాయలో క్యాలరీలు తక్కువగానే ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి వంకాయను డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. జీవక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది. 
 
శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటు సమస్యలను తగ్గిస్తుంది. నరాల వ్యాధుల నుండి కాపాడుతుంది. ఆకలిని పెంచుటలో వంకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. వంకాయ ఆకుల రసంలో కొద్దిగా తేనెను కలుపుకుని రోజుకు మూడుసార్లు తీసుకుంటే దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు తొలగిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు