* పసుపు వాడడంవల్ల బ్లడ్‌ప్రెషర్ తగ్గుతుంది. గోరు చుట్టుకు పసుపును మందుగా వాడితే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
* నోటి దుర్వాసనలకు, దంతాల వ్యాధులకు పసుపు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
* నీళ్ళతో పసుపుని మరిగించి బట్టలో వడకట్టి, ఈ వడకట్టిన నీటితో కళ్ళను శుభ్రపరచుకుంటే కళ్లల్లో పుసులు తగ్గుతాయి.
* కొంచెం నిమ్మరసంతో పసుపుని కలిపి కురుపులు ఉన్నచోట రాస్తే ఉపశమనంగా ఉంటుంది.
* పసుపు రోజూ వాడడం వల్ల సాధారణ మధుమేహం నుండి కుష్టు వ్యాధి వరకు అనేకానేక సాధారణ అనారోగ్యాలకు చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది.
* బ్రహ్మజెముడుతో పసుపు కలిపి పుండ్లు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
* తుమ్మిపూలను మిరియాలు, బెల్లంతో చూర్ణం చేసి సేవిస్తే దగ్గు తగ్గుతుంది.
* గ్లాసుడు పాలు వేడి చేసి దానిలో తేనె వేసి తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది. పాలల్లో తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కాచి, ఆ పసుపు పాలు తీసుకున్నా దగ్గు, జలుబు తగ్గుతాయి.