శరీర బరువును తగ్గించాలంటే.. జిమ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదని.. మనం తీసుకుంటున్న ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలంటే.. ముందు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు అధికంగా చేర్చుకోవాలి. సాధారణమైన నీటిని తాగకుండా.. అందుకు బదులుగా జీలకర్ర నానిన నీటిని సేవించాలి.
ఇంకా లెమన్ టీ సేవించడం ద్వారా బరువు తగ్గొచ్చు. అరటి దూటల రసాన్ని సేవించడం, గరిక రసాన్ని సేవించడం ద్వారా బరువు తగ్గుతుంది. రోజూ ఉసిరికాయ రసాన్ని సేవించడం ద్వారా బరువు తగ్గొచ్చు. వీటితో పాటు ఉదయం పూట అరగంట వాకింగ్ చేయడం మంచిది. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.