దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకుంటే?

శనివారం, 24 జులై 2021 (22:33 IST)
దాల్చిన చెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాదు.. తలనొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకుని ముప్పై నిమిషముల తరువాత వేడి నీటితే కడిగేయాలి.ఇలా చేయడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందుతారు.
 
తాజా ద్రాక్షా పండ్లను తీసుకుని జ్యూస్ చేసుకుని తాగడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్‌ను రోజుకు రెండు సార్లు తాగితే సరిపోతుంది.
 
అల్లం రసాన్ని కాస్త నిమ్మ రసంలో కలిపి తాగడం వలన తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. తలనొప్పి ఎక్కువైనప్పుడు మసాజ్ చేసుకోవడం వలన నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మెడ, తల భాగాన్ని నొక్కుతూ మెల్లగా మసాజ్ చేసుకోవడం వలన రక్తప్రసరణ పెరిగి తలనొప్పి తగ్గుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు