శరీరానికి క్యాల్షియం కావాలి. పాలలో ఇది అధికంగా వుంటుంది. ఇది ఎముకలకు మేలు చేసేదే. దీనివలన ఎముకలు పుష్ఠిగా వుంటాయి. దృఢమైన ఎముకల వలన శరీరం నిటారుగా నిలుస్తుంది. చక్కని రూపం వస్తుంది. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె కండరాలు ఆరోగ్యంగా వుంటాయి. పాలు అంతగా ఇష్టపడనివారు పెరుగును చిలక్కొట్టి మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు.
అయితే ఇవి మాత్రం తినకండి..
ఆహారంలో అధిక ఉప్పు అనవసరం. చక్కెర ఫరవాలేదు కాని అదనపు చక్కెర అనర్థం. గ్లూకోజ్, సుక్రోజ్ వంటివి తీసుకోవద్దు. చక్కెరలు శరీరంలో ప్రొటీన్లతో జరిపే చర్యల వల్ల శరీరంలో వయసు మీద పడిన లక్షణాలు వస్తాయి.