సాధరణంగా మనకు ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఐతే శీతాకాలంలో కాఫీ తాగడం వల్ల కఫం పేరుకుంటుంది. ముక్కు దిబ్బడ వంటి సమస్యలు తలెత్తవచ్చు. కనుక కాఫీ, హెర్బల్ టీలకు దూరంగా ఉండండి. ఇంకా నీళ్లు ఎక్కువ తాగండి.
ఆకుకూరలు అధికంగా తీసుకోండి. చేతులను శుభ్రంగా ఉంచుకోండి. అవసరమైతే మందులు వాడండి. ఉదయం వాకింగ్ చేయండి. త్వరగా నిద్రపోండి. శరీరానికి మాయిశ్చర్ అప్లై చేయండి. యోగాసనాలు వేయండి. తక్కువగా వేగించిన ఆహారపదార్థాలను తీసుకోండి. ఇలా చేస్తే శీతాకాలంలో అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.