నేటి జీవితంలో నవ్వుకు చోటే దక్కటం లేదు. రోజూ కనీసం ఓ అరగంటపాటు హాయిగా నవ్వేవారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తెలియజేశారు. కీళ్లవాపు, కండరాల నొప్పులు, జిగుసుకుపోవడం వంటి ఇబ్బందులు నవ్వుతో తగ్గిపోతాయి. బాధను తగ్గించే ఎండార్ఫిన్‌లు పార్శ్వ నొప్పితో బాధపడేవారికి నవ్వును ఓ చికిత్స విధానంగా ప్రయోగిస్తున్నారు.
ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులతో బాధపడేవారికి నవ్వు ఓ మంచి వ్యాయామం. నవ్వువలన ఊపిరితిత్తులు బాగా వ్యాకోచిస్తాయి. రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఆస్తమా రోగులకు శ్వాస నాళాల్లో శ్లేష్మం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. దానిని బయటకు తెప్పించేందుకు వైద్యులు ఫిజియోథెరపీని సూచిస్తున్నారు.