గాయత్రి మంత్రానికి వాల్మీకి రాసిన 24వేల రామాయణ శ్లోకాలకు సంబంధం ఉందా?

సోమవారం, 8 ఆగస్టు 2016 (11:14 IST)
ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ |
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ ||
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ |
పశ్చాద్రావణకుంభకర్ణహననం చేతద్ధి రామాయణమ్ ||
 
బాంధవ్యాలు, బాధ్యతల తీరు తెన్నులు ఎలా వుండాలో రామాయణం మనకు ఉద్భోధిస్తుంది. 24వేల శ్లోకాలతో కూడిన రామాయణము పవిత్ర గ్రంథము. రామాయణంలోని పాత్రల ద్వారా ఆదర్శ జీవితం ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఆదికావ్యం రామాయణం. రామాయణాన్ని చదవటం ద్వారా శత్రువులను అధిగమించవచ్చు. స్త్రీలు రామాయణాన్ని విన్నా, చదివినా, రాముడి వంటి పుత్రుడు కలుగుతాడు.  
 
అదే పెళ్లికాని ఆడపడుచులు చదివినా, విన్నా శ్రీరాముడి లాంటి భర్త లభిస్తాడు. ఇంకా దీర్ఘాయుష్షు, సంకల్ప సిద్ధి, దైవానుగ్రహం కలుగుతాయి. ఈ కావ్యాన్ని పఠించినా, ఆలకించినా దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి. అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి. 
 
ఇక.. "తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.." వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో అంతర్లీనమైన గొప్ప విషయం ఏమిటంటే? 24వేల శ్లోకాలతో ప్రతి 1000వ శ్లోకం, గాయత్రి మంత్రంలోని అక్షరము వరుస క్రమంలో మొదలవుతుంది. అంటే ప్రతి 1000వ శ్లోకం మొదటి అక్షరం తీసుకుంటే గాయత్రి మంత్రం వస్తుంది. 

వెబ్దునియా పై చదవండి