'కన్నెపల్లి జంగలిలో గిరిజనుల జాతర' మేడారం జాతర (వీడియో సాంగ్)

గురువారం, 25 జనవరి 2018 (13:46 IST)
మేడారం జాతర 2018 రానే వచ్చింది. జనవరి 31వ తేదీ నంచి ఫిబ్రవరి 3 తేదీ వరకు జాతర కొనసాగుతుంది. భక్తులు ఇప్పటికే మేడారం జాతరకు తండోపతండాలుగా బయలుదేరుతున్నారు. జాతర సందర్భంగా గాయకులు పాడిన పాటలు భక్తులను అలరిస్తున్నాయి. 
 
"కన్నెపల్లి జంగలిలో గిరిజనుల జాతర  
జల జల జంపన్న నది దాపున జాతర
కొండా కోన నడిమధ్యన అడవి బిడ్డ జాతర
తలవంచని మేడరాజు తనయి జాతర
అడవికి యుద్ధం నేర్పిన అమ్మ జాతర
మూడొద్దుల ముత్తైదువుల  కోయ జాతర
ఏడు వందల ఏండ్ల జానపదుల జాతర
రాజును ఎదురించిన ధిక్కార జాతర
గులాంగిరిని ప్రశ్నించిన గూడెం జాతర
గుండె ధైర్యాన్ని చాటె కొండ జాతర
ఆలయమే లేని అపూర్వ జాతర
గద్దెలే గర్భగుడులు ఐన జాతర" 
అంటూ ఈ జాతర పాట కొనసాగుతోంది. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు