ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో బంగాళదుంపలు ఒకటి. వీటితో అనేక రకాల వంటకాలు చేసుకుని ఆరగిస్తుంటాం. ముఖ్యంగా, ఆలూ ఫ్రై, పులుసు, టమోటా వంటి కూరలను, వివిధ రకాల చిప్స్‌ను తయారు చేసుకుని ఆరగిస్తుంటాం. అయితే కేవలం వంటలతోనే కాకుండా, ఆలూ జ్యూస్‌తో కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
* బంగాళాదుంపల జ్యూస్‌తో మైగ్రేన్ నొప్పికి మటుమాయమై పోతుంది.
* నిజానికి ఆలుగడ్డలను తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.
* పొటాటో జ్యూస్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగే, జీర్ణాశయం, పేగుల్లో ఏర్పడే అల్సర్లను నివారిస్తుంది.
* ఈ జ్యూస్‌లో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్య నుంచి ఉపశమనాన్నిస్తుంది.
* ఆలుగడ్డలై విటమిన్ "సి" ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేస్తుంది. రక్తహీనత సమస్య పోతుంది. కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు పోతాయి.