తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రగ్యా సువర్సే అనే మహిళను తన అత్తమామలు, ఆడపడుచులు గత కొద్ది కాలం నుంచి నల్లగా ఉన్నావంటూ వేధించసాగారు. వారి వేధింపులు, హేళనలు తట్టుకోలేని బాధిత మహిళ.. ఆ కుటుంబాన్ని హత్య చేసేందుకు ప్లాన్ వేసింది.
ఇటీవల తమ సమీప బంధువు నివాసంలో జరిగిన ఫంక్షన్‌లో అత్తమామలు, ఆడపడుచులను హత్య చేయాలని డిసైడ్ అయింది. పప్పులో విషం కలిపిన ఆమె మొదట అత్తమామలు, ఆడపడుచులకు ఇచ్చింది.
దీంతో తొలుత విషంతో కూడిన పప్పును ఆరగించిన వారిలో నలుగురు పిల్లలు, ఒక పెద్దాయన ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత 120 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ప్రగ్యాను అదుపులోకి తీసుకుని వించారు. ఈ విచారణలో నేరాన్ని ఆమె అంగీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.