మధుమేహ వ్యాధి రోగుల్లో మనదేశం రెండో స్థానంలో ఉంది. ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అలాంటి వ్యాధికి శాశ్వతంగా నయం చేసే మందులను మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేక పోతున్నారు. అలాంటి చక్కెర వ్యాధికి వంటిల్లో ఉండే మెంతులతో చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి ఔషధ గుణాలకు పెట్టింది పేరు. వీటిల్లో అనేక ఔషధగుణాలు దాగి ఉన్నాయి.
* షుగర్ వ్యాధితో బాధపడేవారికి మెంతులు బాగా పనిచేస్తాయి.
* శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంతోపాటు, గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది.
* రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నవారు రోజూ ఉదయం అరస్పూన్ మెంతిపొడి తీసుకుంటే సమస్య తగ్గుతుంది.
* మెంతులు టైప్-1, టైప్-2 మధుమేహాలు రెండింటిలోనూ ఔషధంగా పని చేస్తాయి.
* మెంతుల్లో ఉండే ఔషధ గుణాలు మధుమేహం మీద పని చేస్తాయి.
* అనేక రోగాలకు కారణమయ్యే కఫాన్ని, వాతాన్ని మెంతుల వాడకంతో తగ్గించవచ్చు.
* మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇవి దివ్యౌషధంగా పనిచేస్తాయి.
* శరీరంలో ఎక్కువగా ఉండే చెడు కొలెస్ట్రాల్ నిల్వలను మెంతులు నియంత్రిస్తాయి.
* అధిక బరువు సమస్య నుంచి బయట పడాలంటే మెంతులను వాడాలి.
* మెంతులు జీర్ణ వ్యవస్థను శక్తివంతం చేసి ఆకలిని పెంచుతాయి.
* చెమటను పుట్టించి శరీరాన్ని చల్లబరిచే గుణం మెంతుల్లో ఉంది.
* నీళ్ల విరేచనాలను అరికట్టడంలో మెంతులు బాగా పనిచేస్తాయి.