బెండకాయలు ఎవరు తినకూడదో తెలుసా?

సోమవారం, 8 మే 2023 (23:07 IST)
బెండకాయలు. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియకు మేలు చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణం వల్ల కాలేయాన్ని ఫ్రీరాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. ఐతే బెండకాయలను కొంతమంది తినరాదు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బెండకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్ధీకరించవచ్చు. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయి. బెండకాయల్లో వుండే లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 
బెండలోని ఫోలేట్లు అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి. గర్భణీగా ఉన్నప్పుడు బెండకాయలు తింటూ వుండాలి. బెండకాయ గింజల్ని ఎండబెట్టి చేసిన పొడి మధుమేహానికి మందుగా పనిచేస్తుంది. బెండకాయ గింజల్లోని పదార్ధాలు అద్భుత యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తూ ఒత్తిడిని తగ్గిస్తాయి.
 
విటమిన్ కె ఎక్కువగా ఉండే బెండకాయలు ఎముకలకూ ఎంతో మంచిది. మొలలూ, మూత్రపిండ వ్యాధులు, కీళ్ళ నొప్పులూ ఉన్నవాళ్ళు తగు మోతాదులో తీసుకోవడం మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు