విరేచనాలు అనేవి చాలా సాధారణ రుగ్మతలలో ఒకటి. మలంలో ఎక్కువ నీటి కంటెంట్ ఉన్నప్పుడు, అది పెద్ద ప్రేగు ద్వారా శోషించబడనప్పుడు ఇలా నీళ్ల విరేచనాలు అవుతుంటాయి. కొన్ని ఆహార పదార్థాలకు అలెర్జీలు, ప్రేగు సంబంధిత వ్యాధులు, ఆల్కహాల్ వినియోగం, మందులు, హైపర్ థైరాయిడిజం, మధుమేహం, కొన్ని ఇన్ఫెక్షన్స్, పోషకాలను సరిగ్గా గ్రహించకపోవడం వల్ల కూడా విరేచనాలు అవుతుంటాయి.
శరీరం నుండి టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. ఇది శరీరం నుండి పోషకాలు, నీటిని కోల్పోయేలా చేస్తుంది. అలసిపోయేలా చేస్తుంది. సాధారణంగా లూజ్ మోషన్ రెండుమూడు రోజుల వరకు ఉంటుంది. ఇవి తగ్గేందుకు గృహ చిట్కాలు పాటించినా కంట్రోల్ చేయవచ్చు.
అల్లం లూజ్ మోషన్ తగ్గడం కోసం ఒక అద్భుతమైన ఇంటి చిట్కా. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అల్లం రసం తాగడం వల్ల లూజ్ మోషన్ తక్షణమే ఆగిపోవడమే కాకుండా కడుపు నొప్పి తగ్గుతుంది. వేడి జ్యూస్ తాగడం కొంచెం కష్టం కాబట్టి నెమ్మదిగా తగ్గించండి.