చింత గింజలతో మోకాళ్ళ నొప్పులకు చెక్!

శుక్రవారం, 5 ఆగస్టు 2016 (08:34 IST)
సాధారణంగా మోకాళ్ళ నొప్పులు వయసు మళ్లినవారికే కాకుండా ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ఈ మోకాళ్ళ నొప్పుల బాధ వర్ణనాతీతం. ఈ నొప్పుల బాధ నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాల వైద్యం చేస్తుంటారు. ఇందుకోసం వేలాది రూపాయలను ఖర్చు చేస్తుంటారు. అయితే, ఆయుర్వేద వైద్య నిపుణులు మాత్రం ఓ వైద్యం చెపుతున్నారు. ఇంటిపట్టునే లభ్యమయ్యే చింత గింజల వైద్యంతో మోకాళ్ళ నొప్పులను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చన్నది వారి వాదనగా ఉంది. ఆ వైద్యం ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
బాగా పండిన చింత కాయల నుంచి చింత పండును వేరు చేశాక.. చింత గింజలు లభ్యమవుతాయి. వీటిని సేక‌రించి ఒక బాణలిలో వేసి బాగా వేయించాలి. అనంత‌రం 2 రోజుల పాటు వాటిని నీటిలో నాన‌బెట్టాలి. రోజుకు రెండు సార్లు నీటిని మార్చాలి. 2 రోజుల త‌ర్వాత చింత గింజ‌ల‌ను తీసి వాటి పొట్టును వేరు చేయాలి. అనంత‌రం వ‌చ్చే విత్త‌నాల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసి ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి శూర్ణంగా చేసుకోవాలి. 
 
ఈ పొడిని జార్‌లో నిల్వ ఉంచుకుని ప్రతి రోజూ అర టీస్పూన్ మోతాదులో రోజుకు రెండు సార్లు నీటితో లేదా పాల‌తో నెయ్యి లేదా చ‌క్కెర‌ను క‌లిపి తీసుకున్నట్టయితే మోకాళ్ళ నొప్పుల నుంచి 3-4 వారాల్లో స‌మ‌స్య పూర్తిగా తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. ఎందుకంటే చింత గింజ‌ల్లో ఉండే ప‌లు ఔష‌ధ పదార్థాలు ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తాయి. అదేవిధంగా కీళ్ల‌లో అరిగిపోయిన గుజ్జును మ‌ళ్లీ ఉత్పత్తి చేస్తాయి. 
 
ఈ చింత గింజల మిశ్ర‌మంతో కీళ్ల నొప్పులే కాదు డ‌యేరియా, చ‌ర్మంపై దుర‌ద‌లు, దంత సంబంధ స‌మ‌స్య‌లు, అజీర్ణం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌టం, ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధులకు చ‌క్క‌ని ఔష‌ధంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఎముక‌లు విరిగితే ఆ ప్ర‌దేశంపై రోజు చింత‌గింజ‌ల పొడిని పేస్ట్‌లా చేసి అప్లై చేయాలి. దీంతో ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి. 

వెబ్దునియా పై చదవండి