మటన్ కూరలో కారం ఎక్కువైందని భర్త మందలింపు.. భార్య సూసైడ్... మనస్తాపంతో భర్త కూడా

ఠాగూర్

బుధవారం, 22 అక్టోబరు 2025 (09:41 IST)
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన వారం రోజులకే భర్త మందలించాడని మనస్తాపం చెందిన భార్య ప్రాణాలు తీసుకుంది. తన భార్య ఎడబాటును తట్టుకోలేకపోయిన భర్త.. భార్య అంత్యక్రియలన్నీ పూర్తి చేసి, పెళ్లయిన 19 రోజులకే ప్రాణాలు ఆత్మహత్యచేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్టణం మండలం, ఎర్దండికి అనే గ్రామంలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన అల్లెపు సంతోష్ (25) అనే వ్యక్తి తన ఇంటికి సమీపంలో ఉండే గంగోత్రి అనే యువతిని గాఢంగా ప్రేమించాడు. ఆ తర్వాత పెద్దలను ఎదిరించి సెప్టెంబరు 26వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 2వ తేదీన దసరా పండుగ కావడంతో భార్యతో కలిసి భర్త అత్తింటికి వెళ్లాడు. భోజనం సమయంలో మాసం కూరంలో కారం ఎక్కువైందని భార్యను మందలించాడు. దీన్ని తట్టుకోలేని భార్య... అదే రోజు రాత్రి అత్తింట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. 
 
అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురైన సంతోష్... వారం రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఉండే అక్క వద్దకు వెళ్లాడు. అక్కడే మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. పెళ్లయి నెల రోజులు కూడా గడవకముందే ప్రేమ దంపతులిద్దరూ భౌతికంగా దూరం కావడంతో ఇరు కుటుంబాలతో పాటు గ్రామంలో విషాదం నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు