పెరుగులో తేనె కలుపుకుని తింటే ఏమవుతుంది?

శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (22:31 IST)
పెరుగు. పాల పదార్థమైన పెరుగుతోనే చాలామంది అన్నం తింటుంటారు. ఉదయాన్నే పెరుగులో ఉల్లిపాయ లేదా మిరపకాయ నంజుకుని తినేస్తారు. పెరుగుతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పెరుగులో తేనె కలుపుని తింటే అల్సర్లు దరిచేరవు. కప్పు పెరుగులో చిటికెడు పసుపు, అరస్పూను అల్లం రసం కలిపి తింటే గర్భిణిలకు మేలు కలుగుతుంది.
 
పిల్లలకు తక్షణ శక్తి రావాలంటే కాస్త చక్కెర కలిపి ఇస్తే చాలు. పెరుగులో తాజా పండ్ల ముక్కలు వేసుకుని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కప్పు పెరుగులో అరస్పూను జీలకర్ర పొడి కలిపి తింటే బరువు తగ్గుతారు.
 
నల్ల మిరియాల పొడి పెరుగులో కలిపి తింటే జీర్ణ సమస్యలుండవు. మెదడు, ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెరుగు మెరుగుపరుస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు