హోమియోపతీ వైద్య సూత్రాలు

మంగళవారం, 19 జూన్ 2007 (20:12 IST)
మానవ జీవితం అడుగడుగునా సూత్రాలతోనే నడుస్తుంది. ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు కొన్ని సూత్రాలు పాటించక తప్పదు. అంతేకాకుండా మనిషి తీసుకునే వైద్యానికి సైతం సూత్రాలు పాటిండం తప్పనిసరి. ఆ కోవలోనే హోమియోపతీ వైద్య సూత్రాలు తెలుసుకుందాం.

1. మనం ఇచ్చే మందు రోగానికి, రోగ లక్షణాలని తగ్గించటానికి కాదు. మనిషికి. ఒకే రోగం అందరిలోనూ ఒకే లక్షణాలని చూపించదనేది సర్వులూ గమనిస్తూన్న విషయమే. ఇది పటిష్టమైన సూత్రమే అని మానసిక శాస్త్రంలో ప్రావీణ్యత ఉన్నవారు ఒప్పుకుంటున్నారు.

2. రోగికి ఏ మందు ఇవ్వాలి. ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి చేత ఏదైనా మందు తినిపించినప్పుడు ఆ వ్యక్తి శరీరంలో ఏయే లక్షణాలు పొడచూపుతాయో అయా లక్షణాలు ప్రదర్శించిన రోగికి అదే పదార్ధం మందుగా పనిచేస్తుంది. దీనికి “ఉష్ణం ఉష్ణేత శితలే” అని సంస్కృతంలో భాష్యం చెప్పొచ్చు. దీనికి ఉదాహరణగా టీకాలను చెప్పుకోవచ్చు. అంటే టీకా మందు వల్ల శరీరం ఎలా స్పందిస్తుందో మనం రుజువు చేసి చూపించవచ్చు.

హోమియోపతీ మందు వేసుకున్న తరువాత శరీరంలోని రక్తంలో కాని, జీవకణాలలో కాని ఎటువంటి మార్పు వస్తుందో ఎవ్వరూ ప్రమాణాత్మకంగా రుజువు చేసి చూపించలేకపోయారు.

వెబ్దునియా పై చదవండి