కావలసిన పదార్థాలు : ఆనపకాయ (సొరకాయ)... అరకేజీ చింతపండు, ఉప్పు... తగినంత పచ్చిమిర్చి... నాలుగు ఉల్లిపాయలు... 2 టొమోటోలు... 2 పసుపు, కారం... సరిపడా కరివేపాకు, కొత్తిమీర.... చెరో రెండు టీ. బియ్యంపిండి లేదా శెనగపిండి... ఒక టీ. నూనె... 50 గ్రా.
తయారీ విధానం : ఆనపకాయను పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఉల్లి, మిర్చి, టొమోటోలను సన్నగా తరిగి ఉంచాలి. పులుసు తీసుకుని దాంట్లో ఆనపకాయ ముక్కలతోపాటు ఉల్లి, మిర్చి, టొమోటోలను వేసి... తగినంత ఉప్పు, పసుపు, కారం కూడా వేసి ఉడికించాలి.
శెనగపిండిని నీటితో కలిపి ఉడుకుతున్న కూరలో పోయాలి. ఇప్పుడు... ఇంగువతో పోపుపెట్టి.. కరివేపాకు, కొత్తిమీరను చల్లి దించేయాలి. అవసరమైతే ఇందులో ములక్కాడలను కూడా వాడవచ్చు. అంతే వేడి వేడి ఆనపకాయ పులుసు సిద్ధమైనట్లే...!