కాలీఫ్లవర్‌ పులావు

శనివారం, 2 ఆగస్టు 2008 (15:28 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం... మూడు కప్పులు
కాలీఫ్లవర్‌... ఒకటి
ఆలుగడ్డలు... మూడు
అల్లం-వెల్లుల్లి పేస్ట్... ఒక స్పూన్‌
పచ్చిమిర్చి... నాలుగు
నూనె... పావు కప్పు
పసుపు... ఒక టేబుల్‌ స్పూన్‌
ఉల్లిపాయలు... మూడు
టమోటాలు... మూడు
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
బాస్మతి బియ్యాన్ని నూనెలో కొద్దిగా వేయించి ప్రెజర్‌ కుక్కర్‌లో ఉడికించాలి. కాలీఫ్లవర్‌ను కూడా ఉడికించాలి. ఆలుగడ్డలను చిన్న ముక్కలు చేసి నూనెలో వేయించాలి. పాన్‌లో నూనె వేసి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగిన తరువాత అల్లం, వెల్లుల్లి పేస్టును, తరిగిన టమోటాలను కూడా వేసి వేయించాలి.

దీనికి పసుపు పొడి, కారం, పొడి మసాలా, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి. సరిపడా ఉప్పు వేసి చివరగా ఉడికించిన కాలీఫ్లవర్‌ వేసి కలపాలి. ఉడికించిన రైస్‌లో ఈ మిశ్రమాన్ని కలపాలి. చివరగా వేయించిన ఆలుగడ్డ ముక్కలు కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి చల్లి అలంకరించి సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి