కాశ్మీరీ దమ్‌ జింజర్ గోబి

కావలసిన పదార్థాలు :
కాలీఫ్లవర్... అరకేజీ
ఉల్లిపాయలు... వంద గ్రా.
అల్లంవెల్లుల్లి... ముప్పావు టీ.
పచ్చిమిర్చి... రెండు
కారం... అర టీ.
పసుపు... కొద్దిగా
గరంమసాలా... అర టీ.
శొంఠిపొడి... అర టీ.
ఇంగువ... చిటికెడు
పెరుగు... అర కప్పు
కొత్తిమీర... రెండు కట్టలు
గసగసాలు... ఒక టీ.
జీడిపప్పు... 25 గ్రా.
పచ్చికోవా... 50 గ్రా.
ఉప్పు... తగినంత
నూనె... రెండు టీ.

తయారీ విధానం :
కాలీఫ్లవర్‌ను కడిగి వేడినీళ్లలో వేసి తీయాలి. వెడల్పాటి మూతి ఉన్న గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇంగువ, ఉప్పు, కారం, మిగిలిన పొడులు అన్నీ వేసి కలిపి, అల్లంవెల్లుల్లి ముద్ద కూడా వేసి వేయించి దించాలి. తరవాత ఇందులోనే పెరుగు కూడా వేసి కలపాలి.

ఆపై గసగసాలు, జీడిపప్పు కలిపి రుబ్బిన ముద్ద, పచ్చికోవా కూడా వేసి కలపాలి. ఇప్పుడు వేడినీళ్లలో వేసి తీసిన కాలీఫ్లవర్‌ ముక్కల్ని వేసి పది నిమిషాలు ఓవెన్‌లోగానీ లేదా మూతపెట్టిగానీ సన్నని మంటమీద పావుగంటసేపు ఉడికించి దించాలి. అంతే కాశ్మీరీ దమ్ జింజర్ గోబీ రెడీ అయినట్లే...!

వెబ్దునియా పై చదవండి