కావలసిన పదార్థాలు : పనీర్... 400 గ్రా. శెనగపిండి... 300 గ్రా. వెల్లుల్లి | అల్లం పేస్టు... రెండు టీ. ఉప్పు... తగినంత నూనె... పావుకేజీ కారం... ఒక టీ. వంటసోడా... చిటికెడు కొత్తిమీర... ఒక కట్ట
తయారీ విధానం : పనీర్‌ను రెండు అంగుళాల పొడవు,ఒక అంగుళం వెడల్పుగా చాకుతో కోసి ఒక పళ్ళెంలో ఉంచాలి. గిన్నెలో శెనగపిండి,అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కొత్తిమీర తరుగు, వంటసోడా, తగినంత ఉప్పు వేసి... తగినన్ని నీళ్ళు పోస్తూ, బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి.
ఇప్పుడు బాగా మరుగుతున్న నూనెలో పనీర్ ముక్కలను బజ్జీల పిండిలో ముంచి వేయాలి. బాగా ఎర్రగా కాలిన తరువాత తీసివేసి... పుదీనా చట్నీ లేదా సాస్‌తో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. అంతే గార్లిక్ పనీర్ బజ్జీ తయారైనట్లే..!