కావలసిన పదార్థాలు : పచ్చిమామిడికాయలు... ఆరు పుదీనా ఆకులు... పావు కప్పు మంచినీళ్లు... నాలుగు కప్పులు జీలకర్ర... ఒక టీ. కారం... అర టీ. ఉప్పు... ఒక టీ. పంచదార... మూడు టీ. ఐస్‌క్యూబ్స్... తగినన్ని
తయారీ విధానం : ఒక పాత్రలో మామిడికాయలు మునిగేంతగా నీటిని పోసి ఉడికించాలి. నీళ్లు చల్లబడ్డాక ఉడికిన మామిడికాయల పై తొక్క తొలగించి స్పూన్‌తో గుజ్జునంతా ఒక పాత్రలోకి తీసుకోవాలి. దీంట్లోనే నాలుగు కప్పుల మంచినీళ్లు, పంచదార, ఉప్పు, కారం, జీలకర్ర వేసి కలపాలి. ఆ తరువాత పుదీనా ఆకులను బాగా కలిపి గ్లాస్లో పోయాలి. ఐస్‌క్యూబ్స్‌ను క్రష్ చేసి గ్లాసుల్లో వేసి చల్ల చల్లగా అతిథులకు సర్వ్ చేయాలి.