నేతి అన్నం

మంగళవారం, 15 జులై 2008 (16:28 IST)
WD PhotoWD
కావలసిన పదార్థాలు :
బాస్మతి రైస్... ఒక కేజీ
ఉల్లిపాయలు... ఐదు
టమోటాలు.. ఐదు
క్యారెట్, బంగాళాదుంప, పచ్చ బఠాణీలు, బీన్స్ ముక్కలు.. ఒక కప్పు
నెయ్యి.. 100 గ్రాములు
కరివేపాకు, నూనె... తాలింపుకు సరిపడా
పుదీనా.. ఒక కట్ట
ఉప్పు... తగినంత
అల్లం... చిన్న అల్లం ముక్క
వెల్లుల్లి పాయలు .. పది
దాల్చినచెక్క, లవంగాలు.. చెరో మూడు
మీల్ మేకర్.. 50 గ్రాములు
పచ్చిమిర్చి... పది

తయారీ విధానం :
ముందుగా ఉల్లిపాయలు, టమోటాలు, క్యారెట్, బంగాళా దుంప, పచ్చబఠాణీలను కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పుదీనా ఆకుల కాడలను తీసి శుభ్రం చేసుకోవాలి. మరోవైపు అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చిలను మిక్సిలో మెత్తగా రుబ్బుకోవాలి. మీల్ మేకర్‌ను నీటిలో నానబెట్టి, కాసేపయ్యాక నీటిని పిండి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత స్టౌ మీద కుక్కర్ పెట్టి వేడయ్యాక నూనెను పోసి అందులో తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేపాలి. బాగా వేగాక అందులో పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా ఆకులు, పచ్చిబఠాణీలు, క్యారెట్ ముక్కలు వేసి కాసేపు వేయించాలి. ఇవన్నీ నూనెలో బాగా వేగాక అందులో టమోటా ముక్కలను, మిక్సిలో రుబ్బిన మసాలాను, మీల్ మేకర్‌ను చేర్చి కాసేపు సెగమీద ఉడికించాలి.

టమోటాలు మగ్గాక అందులో కడిగి ఆరబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి, అందులో నెయ్యి, తగిన మోతాదు నీరు, ఉప్పును చేర్చి ఓ సారి మాత్రమే కలియబెట్టి, కుక్కర్‌‌ను మూతపెట్టాలి. కుక్కర్ ఒక విజిల్ వచ్చిన వెంటనే స్టౌవ్‌ను ఆపేయాలి. పది నిమిషాల తర్వాత కుక్కర్‌లోని రైస్‌ను ప్లేటులోకి తీసుకుని చెర్రీస్, జీడిపప్పు, కూరగాయల ముక్కలతో మీకు నచ్చిన విధంగా అలంకరించుకుని వేడివేడిగా సర్వ్ చేయొచ్చు.

వెబ్దునియా పై చదవండి