పన్నీర్ కుర్మా

బుధవారం, 6 ఆగస్టు 2008 (17:23 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
పన్నీర్... ఒక కప్పు
తెల్లగడ్డలు... నాలుగు
అల్లం... రెండు చిన్న ముక్కలు
కారం... అర టీస్పూన్
గరం మసాలా... ఒక టీస్పూన్
నెయ్యి... రెండు టీస్పూన్లు
ఉల్లిపాయ... ఒకటి
పెరుగు... ఒక కప్పు
పచ్చిమిర్చి... రెండు
ధనియాల పొడి... అర స్పూన్
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
ముందుగా పెరుగుకు గరంమసాలా పొడిని కలుపుకుని మిక్సీలో రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, టమోటా, కొబ్బరి తరుగు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చిలను వేసి బాగా వేయించాలి. తరువాత దీనికి పెరుగు మిశ్రమాన్ని, ముక్కలుగా చేసుకున్న పన్నీర్‌ను చేర్చి ఐదు నిమిషాలసేపు ఉడికించాలి. ఇది బాగా ఉకిన తరువాత కొత్తిమీర తరుగులను చేర్చి దించేయాలి. ఈ కుర్మాను చపాతీలకు, పరోటాలకు సైడ్‌డిష్‌గా సర్వ్ చేయొచ్చు.

వెబ్దునియా పై చదవండి