పెరుగుతో కాప్సికమ్‌ కూర

శనివారం, 9 ఆగస్టు 2008 (17:04 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
కాప్సికమ్‌లు చిన్న సైజువి... ఎనిమిది
పెరుగు... ఒక కప్పు
నెయ్యి... సరిపడా
జున్ను లేదా పనీర్‌... సరిపడా
కారం... సరిపడా
పసుపు... చిటికెడు
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
కాప్సికమ్స్‌ను బాగా ‌శుభ్రం చేసుకొని... వాటి ముచ్చికల వద్ద కట్‌ చేసి నెయ్యిలో వేయించి పక్కనుంచుకోవాలి. పెరుగును పల్చని బట్టలో వేసి మూట గట్టి వేలాడదీయాలి. అలా చేస్తే నీరంతా కిందికి దిగి గట్టిపడిన పెరుగు మిగులుతుంది. దీంట్లో పసుపు, ఉప్పు‌, కారం అన్నీ కలిపి... వేయించి ఉంచుకున్న క్యాప్సికంలలో కూరాలి.

తరువాత వాటిని బాణలిలో వరుసగా పేర్చి నూనె వేసి సన్నటి సెగలో వేయించాలి. బాగా వేగిన తరువాత ప్లేటులోకి తీసి వాటిపై జున్ను లేదా పనీర్‌ ముక్కలు, కొత్తి మీర ఆకులను అందంగా అలంకరించి సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి