కావలసిన పదార్థాలు : పొన్నగంటి కూర... ఆరు కట్టలు ఉల్లిపాయలు... రెండు పచ్చికొబ్బరి చిప్ప... పావు భాగం నూనె... తగినంత పసుపు... చిటికెడు పోపు కోసం ఎండుమిరపకాయలు, మిపపప్పు... సరిపడా ఆవాలు, జీలకర్ర కరివేపాకు, వెల్లుల్లి... సరిపడా
తయారీ విధానం : పొన్నగంటి ఆకును బాగా కడిగిన తరువాత సన్నగా తరిగి ఉంచుకోవాలి. ముందుగా పోపు వేసి, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. తరువాత కొంచెం పసుపు వేసి, తరిగిన ఆకు వేసి మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసి, సరిపడా ఉప్పు వేసి నీరంతా ఇగిరేవరకూ వేయించాలి. చివరగా దించేముందు కొబ్బరి తురుము వేసి కలపాలి. ఈ ఆకుకూరను తినడం వల్ల కంటిచూపు సమస్యలు ఎదుర్కొంటున్న వారికి చాలా మేలు చేకూరుతుంది.