కావలసిన పదార్థాలు : బేబీకార్న్ (లేత మొక్కజొన్నలు) ... ఆరు వరిపిండి... ఒక టీస్పూన్ మొక్కజొన్నపిండి... రెండు టీస్పూన్లు అల్లం, వెల్లుల్లి పేస్ట్... రెండు టీస్పూన్లు ఉల్లిపాయ... ఒకటి పచ్చిమిరపకాయలు... రెండు కారం... అర టీస్పూన్ టొమోటో సాస్... రెండు టీస్పూన్లు సోయా సాస్... ఒక టీస్పూన్ కొత్తిమీర... కొద్దిగా నూనె... సరిపడా ఉప్పు... సరిపడా కొత్తిమీర... సరిపడా
తయారీ విధానం : కాసిన్ని నీళ్లలో బేబీకార్న్స్, ఉప్పు కలిపి కాసేపు ఉడికించాలి. తరువాత నీటిని ఒంపేసి వాటిని ఆరబెట్టాలి. వరిపిండి, మొక్కజొన్న పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఓ టీస్పూన్ టొమోటో సాస్, ఉప్పులను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బేబీకార్న్స్‌కు బాగా పట్టించాలి.
నూనె వేడి చేసి అందులో బేబీకార్న్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను రంగు మారేదాకా వేయించాలి. అందులో బేబీకార్న్స్, మిగిలిన టొమోటో సాస్, సోయాసాస్‌లను వేసి బాగా కలపాలి. మరికాస్త ఉప్పుజల్లి పది నిమిషాలపాటు సన్నటి మంటపై వేయించాలి. తరువాత కొద్దిగా (ముక్కలు తడిసేలాగా) నీటిని చేర్చుకుని నీరు ఆవిరైపోయేంతదాకా ఉడికించుకోవాలి. చివరగా దించే ముందు కొత్తిమీర చల్లి అతిథులకు వడ్డించండి.