కావలసిన పదార్థాలు : రవ్వ... అర కిలో పెసరపప్పు... 75 గ్రాములు ఉప్పు... సరిపడ జీడిపప్పు... 20 గ్రాములు జీలకర్ర... ఒక టీస్పూన్ మిరియాలు... సరిపడా అల్లం... కొద్దిగా నెయ్యి... 150 గ్రాములు
తయారీ విధానం : పెసరపప్పును వేయించి, ఉడకబెట్టిన తరువాత నీరు తీసెయ్యాలి. రవ్వను నేతిలో వేయించాలి. మిగిలిన నెయ్యిలో జీడిపప్పు వేయించి, అందులోనే మిరియాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక అల్లం కూడా వేయించాలి. అర లీటరు నీటిని కూడా పోయాలి.
ఆ తర్వాత ఉప్పు, వేయించిన రవ్వ కూడా దీనికి కలిపి... బాగా ఉడకనిచ్చి, ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పును వేయాలి. నీరంతా ఇగిరి పోయి బాణలికి అంటుకోకుండా చూసుకుని దించినట్టయితే.. రవ్వ పొంగలి సిద్ధమైనట్లే...!