రుచికరమైన 'కొబ్బరి పాయసం'

గురువారం, 5 జూన్ 2008 (17:06 IST)
పాయసం అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే మామూలుగా చేసే విధంగా కాక పాయసాన్ని కాస్త డిఫరెంట్‌గా చేస్తే ఆ రుచికి తినేవారు దాసోహం కాకపోరు. అందుకే ఓ వెరైటీ పాయసం తయారీని అందిస్తున్నాం.

ఈ కొబ్బరిపాయసం తయారీకి కావల్సిన పదార్ధాలు : పాలు- రెండులీటర్లు, అన్నం- ఒకటిన్నర కప్పు, నెయ్యి- రెండు చెంచాలు, ఏలకులు- నాలుగు, కొబ్బరితురుము- నాలుగు చెంచాలు, ఎండుద్రాక్ష- ఓ చెంచా, జీడిపప్పు- ఓ చెంచా, పంచదార- ఓ కప్పు.

పాయసం తయారు చేయు విధానం :నెయ్యిని బాగా కాచి దాన్ని అన్నంలో కలిపి పక్కన ఉంచాలి. తర్వాత జీడిపప్పు ఎండుద్రాక్షను కూడా వేయించి పక్కనపెట్టుకోవాలి. తర్వాత పాత్రలో పాత్రలో పోసి వేడిచేయాలి. అలా పాలు కాగుతున్న సమయంలో దానిలో యాలకులు వేసి కాగనివ్వాలి.

అలా కాసేపు కాగిన తర్వాత అన్నాన్ని, కొబ్బరితురుముని కలిపి ఉడకనివ్వాలి. ఈ సమయంలో మంట సన్నాగా ఉండేలా చూడాలి. పాలలో వేసిన అన్నం బాగా జావలా మారేవరకు కాచి తర్వాత అందులో పంచదార వేసి అది పూర్తిగా కలిసిపోగానే జీడిపప్పు, ఎండుద్రాక్షను కూడా వేసి పాయసం చిక్కగా రాగానే దించేయాలి. ఇలా తయారు చేసిన పాయసాన్ని కాస్త వేడిగా ఉన్నప్పుడే ఆరగిస్తే రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి