ఆవ ఆకులతో కూర

కావలసిన పదార్థాలు :
ఆవ ఆకులు... పావు కేజీ
పాలకూర... వంద గ్రా.
ఉల్లిపాయలు... 25 గ్రా.
ముల్లంగి... రెండు
వెల్లుల్లి... ఐదు రెబ్బలు
అల్లం... చిన్నముక్క
పచ్చిమిర్చి... రెండు
ఉప్పు... రుచికి సరిపడా

పోపు కోసం...
అల్లం తరుగు... ఒక టీ.
పచ్చిమిర్చి తరుగు... ఒక టీ.
నెయ్యి లేదా నూనె... రెండు టీ.
మిర్చిపొడి... అర టీ.

తయారీ విధానం :
ఆవ ఆకులను, పాలకూర ఆకులను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించాలి. చల్లారిన తరువాత మెత్తగా గ్రైండ్ చేయాలి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచాలి.

చివరగా ఒక పాత్రలో నెయ్యి లేదా నూనె వేసి.. అందులో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల మిశ్రమం వేసి దోరగా వేగిన తరువాత ముందుగా ఉడికించి గ్రైండ్ చేసుకున్న ఆకుకూరల మిశ్రమాన్ని కూడా వేసి బాగా వేయించాలి. అంతే ఆవ ఆకుల కూర సిద్ధమైనట్లే..! దీన్ని చపాతీలకు సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి