కావలసిన పదార్థాలు : బేబీ పొటాటోలు (చిన్న బంగాళాదుంపలు)... ఒక కేజీ కొత్తిమీర... నాలుగు కప్పులు పచ్చిమిర్చి... పదిహేను అల్లంవెల్లుల్లి ముద్ద... రెండు టీ. జీలకర్ర పొడి... ఒక టీ. ఉప్పు... తగినంత మీగడ... ఎనిమిది టీ. నిమ్మరసం... నాలుగు టీ. మంచినీరు... తగినన్ని పసుపు... చిటికెడు కార్న్‌ఫ్లోర్... నాలుగు టీ. నూనె... ఎనిమిది టీ.
తయారీ విధానం : బేబీ పొటాటోల్ని చెక్కు తీసి, పైభాగంలో చాకుతో చిన్న గాటు పెట్టి, నూనెలో దోరగా వేయించి తీయాలి. మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, కార్న్‌ఫ్లోర్, నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీయాలి. బాణలిలో నాలుగు ఎనిమిది టీస్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి.
అందులో అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మంచివాసన వచ్చేవరకూ వేయించి, బంగాళాదుంపల్ని వేసి తగినంత ఉప్పు, పసుపు, నిమ్మరసం, మీగడ చల్లి సన్నని సెగమీద రెండు నిమిషాలు వేయించాలి. తరవాత కొత్తిమీర గుజ్జు వేసి బాగా కలిపి దించేయాలి. అంతే బేబీపొటాటో గ్రీన్ చిల్లీ ఫ్రై రెడీ అయినట్లే...!