అమెరికా జోక్యం సరికాదు: ఆహ్మదీ

ఇరాన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ ఆహ్మదీ నెజాద్‌ అగ్రరాజ్యమైన అమెరికా దేశంపై మరోసారి మండిప డ్డారు. ఇరాన్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్షాలు సృష్టిస్తున్న గందరగోళం నేపథ్యంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్రంగా స్పందించారు.

అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని నెజాద్‌ ఆరోపించారు. ఎన్నికల అనంతరం దేశంలో నెలకొన్న గందరగోళానికి మరింత ఆజ్యం పోయడమే ఒబామా తమ లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు.

తమ దేశం పట్ల వైఖరిని మార్చుకున్నామని చెపుతున్న అమెరికా మా అంతర్గత వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. ఇరాన్‌తో చర్చలను కోరుకుంటు న్నామని అమెరికా దేశంవారు చెపుతున్నారు. దానికి ఇదే సరైన దారా? వాళ్లు కచ్చితంగా మా పట్ల తప్పు చేశారు అని నెజాద్‌ ఆదివారం వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో అవినితికి పాల్పడి తాను గెలుపొందినట్టు ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఒబామా స్పందించిన తీరుపై ఆయన సొంత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని నెజాద్‌ పేర్కొన్నారు.

అణ్వాయుధాలను అభివృద్ధి పరుచుకుంటున్నందునే ఇరాన్‌తో సంబంధాలను మెరుగు పరుచుకోవాలని ఒబామా సర్కారు భావిస్తుందన్నారు. తమకు చిక్కులు తెచ్చిపెడుతు న్నామన్న రీతిలో ఒబామా కనపడకపోయినప్పటికీ అదే లక్ష్యంతో తమ ప్రభుత్వానికి వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి