ఆఫ్ఘనిస్థాన్‌లో స్థిరత్వం పాక్‌పై ఆధారపడివుంది

ఆప్ఘనిస్థాన్‌లో స్థిరత్వం పాకిస్థాన్‌పై ఆధారపడి ఉందని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ మిలిబాండ్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌లో సుస్థిరత ఉంటేనే ఆఫ్ఘనిస్థాన్‌లోనూ పరిస్థితులు మెరుగుపడతాయని బుధవారం ఆయన పేర్కొన్నారు. అమెరికా- పాక్ సంబంధాల్లో తిరిగి సమతూకం తీసుకొచ్చేందుకు ఒబామా అధికారిక యంత్రాంగం చేపట్టిన చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

పాకిస్థాన్‌లో మరింత సుస్థిర పరిస్థితులు నెలకొనాలి. దీని వలన ఆఫ్ఘనిస్థాన్‌లో ఆశించిన ఫలితాలు పొందవచ్చని మిలిబాండ్ తెలిపారు. ఈ ప్రాంతంలో సమస్యకు దీర్ఘకాలిక మిలిటరీ పరిష్కారం సాధ్యపడదని అభిప్రాయపడ్డారు. మిలిటరీతో కేవలం రాజకీయ, ప్రభుత్వ యంత్రంగాన్ని మాత్రమే గాడిలో పెట్టడం సాధ్యమవుతుందని పీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిలిబాండ్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి