ఇరాక్‌లో కిడ్నాపైన బ్రిటన్ పౌరుల మృతి

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రెండేళ్ల క్రితం కిడ్నాప్ అయిన బ్రిటన్ పౌరుల్లోని మిగిలిన ఇద్దరు సైనికులు కూడా మరణించివుంటారని గోర్డాన్ బ్రౌన్ తెలిపారు. బ్రిటన్ ప్రధాని గోర్డాన్ బ్రౌడన్ బుధవారం మాట్లాడుతూ.. ఇదిలా ఉంటే పీటర్ మూర్ అనే మరో పౌరుడు ఇప్పటికీ కిడ్నాపర్ల వద్ద ప్రాణాలతో ఉండివుంటాడని నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ కంప్యూటర్ కన్సల్టంట్‌ను విడుదల చేయాలని పిలుపునిచ్చారు. మే 2007లో మూర్, అతనికి రక్షణగా ఉన్న నలుగురు భద్రతా సిబ్బంది బాగ్దాద్‌లో కిడ్నాప్ అయ్యారు. మూర్ ఒక్కరు మాత్రం ఇప్పటికీ ప్రాణాలతో ఉండివుంటారని భావిస్తున్నారు. అతనితోపాటు కిడ్నాపర్ల వద్ద బందీలుగా ఉన్న నలుగురు బ్రిటన్ సైనికుల్లో ఇద్దరి వస్తువులను, మిగిలిన ఇద్దరి మృతదేహాలను గత నెలలో బ్రిటన్ అధికార యంత్రాంగానికి పంపారు.

మూర్‌తోపాటు, అలన్ మెక్‌మెనెమీ, అలెక్ మాక్‌లాచ్లాన్‌లు ఇప్పటివరకు ప్రాణాలతోనే ఉన్నారని భావించాము. అయితే గత నెలలో వారికి సంబంధించిన వస్తువులు తమకు అందిన తరువాత వారు మృతి చెంది ఉంటారని సంబంధిత కుటుంబసభ్యులకు తెలియజేశామని గోర్డాన్ బ్రౌన్ ఓ ప్రకటనలో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి