పాకిస్థాన్ పోలీసులు ఇస్లామాబాద్‌లో బుధవారంనాడు 25మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
ఇస్లామాబాద్‌లో బుధవారంనాడు 25మంది ఉగ్రవాదులను పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. వీరంతా లాహోర్, కరాచీలాంటి ప్రముఖ పట్టణాలలో దాడులకు రూపకల్పన చేసినవారేనని పోలీసులు తెలిపారు.
తాము అదుపులోకి తీసుకున్న అనుమానిత ఉగ్రవాదుల్లో చాలామంది ఆత్మాహుతి దాడులకు పాల్పడేవారని, మరికొంతమంది వీరికి సహాయకులగా ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్న వారిని ప్రముఖ ఉగ్రవాదులుగా ప్రకటిస్తున్నట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ సైయద్ కలీమ్ ఇమామ్ పేర్కొన్నారు. వీరిలో ఆరుగురు మోస్ట్ వాంటెడ్ క్రిమనల్సని ఆయన తెలిపారు.
వీరినుండి కరాచీ, లాహోర్ ప్రాంతాలలో దాడులు జరిపేందుకు తగిన ప్రణాళికలను రూపొందించి పత్రాలు లభ్యమైనట్లు ఆయన తెలిపారు. వీటితోపాటు వీరికి సహకరించేవారి వివరాలుకూడా దొరికినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదిలావుండగా పాక్ సైన్యం ఆ దేశ వాయువ్య ప్రాంతంలోని తాలిబన్లపై దాడులను ముమ్మరం చేసిన తర్వాత లాహోర్, పాకిస్థాన్, పెషావర్‌లాంటి ప్రముఖ పట్టణాలలో ఆత్మాహుతి దాడులు పెరిగిపోయాయి. ఇలా జరిగిన దాడులకు తామే బాద్యులమని తహరీక్-ఏ-తాలిబన్ ప్రకటించింది.