ఉరుంఖీ హింసాకాండ: 192కి చేరిన మృతులు

చైనాలోని ఉరుంఖీ నగరంలో ఇటీవల జరిగిన మత ఘర్షణల్లో మృతి చెందినవారి సంఖ్య 192కి పెరిగింది. ఇదిలా ఉంటే చైనా ప్రభుత్వం అల్జీరియాలో ఉంటున్న చైనీయులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉరుంఖీలో ఉయ్‌గుర్ అనే సంప్రదాయ ముస్లిం వర్గం ఇటీవల పెద్దఎత్తున విధ్వంసానికి దిగిన సంగతి తెలిసిందే.

వారి ఆందోళనను అదుపు చేసేందుకు చైనా భద్రతా సిబ్బంది చేసిన ప్రయత్నాలు హింసాకాండకు దారితీశాయి. ఈ మత హింసాకాండకు సంబంధించి అల్ ఖైదా తీవ్రవాద సంస్థ చైనీయులపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. అల్జీరియాలోని తమ పౌరులను అల్ ఖైదా లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, బుధవారం చైనా ప్రభుత్వం వారిని అప్రమత్తం చేసింది.

ముందురోజు అల్ ఖైదా అల్జీరియా విభాగం ఏక్యూఐఎ చైనీయులపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు పంపింది. చైనాలో జులై 5న చెలరేగిన మత అల్లర్ల మృతి చెందినవారి సంఖ్య ఇంతకుముందు వరకు 182 వద్ద ఉండగా, అల్లర్లలో తీవ్రంగా గాయపడిన మరో పది మంది మృతి చెందినట్లు బుధవారం చైనా అధికారిక యంత్రాంగం వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి