గగుర్పొడిచే మైఖేల్ శవ రిపోర్టు

DBMG
మైఖేల్ శవపంచనామాలో గగుర్పొడిచే అంశాలెన్నో వెలుగులోకి వచ్చినట్లు న్యూయార్క్‌కి చెందిన ఓ పత్రిక వెల్లడించింది. మరణించేనాటికి మైఖేల్ భౌతిక పరిస్థితి అతి దారుణంగా ఉంది. జాక్సన్ పూర్తిగా ఎముకల గూడులా మారిపోయాడు.

అతని కడుపులో మాత్రలు తప్ప ఇంకేమీ లేవు. అతని తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు. శరీరమంతా సూది గుర్తులు, వాటి తాలూకు గాయాలే. పక్కటెముకలు చిట్లినట్లు తెలుస్తోంది. అతని పిరుదలు, తొడలు, భుజాలపై సూదులతో గుచ్చిన గాయాలతోపాటు కొన్ని గాయాలు మానిపోయిన ఆనవాళ్లు స్పష్టంగా కనబడుతున్నాయి.

వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే.. మైఖేల్ జాక్సన్ కనీసం మూడు సంవత్సరాల నుంచి పెయిన్ కిల్లర్స్‌ను ప్రతిరోజూ సూదుల ద్వారా తీసుకుంటున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. దీనికితోడు జాక్సన్ సుమారు 13సార్లు కాస్మొటిక్ ఆపరేషన్లు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మైఖేల్ మరణానికి దారితీసిన పరిస్థితులపై పలు కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది.

మైఖేల్ జాక్సన్ దినచర్యపై ఆరా తీసినప్పుడు, పాప్‌స్టార్ రోజుకి ఒకే ఒక్కసారి ఓ మోస్తరు భోజనం తీసుకునేవాడని తేలింది. అయితే మరణించిన రోజున భోజనమేమీ తీసుకోకుండా ఖాళీ కడుపుతో పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్లనే గుండె ఆగిపోయి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.

మందుల ప్రభావం మూలంగానో, మరి దేనివల్లనో మైఖేల్ జుట్టు మొత్తం ఊడిపోయి తల నున్నగా మారిపోయింది. దీంతో జాక్సన్ విగ్ ధరించి తిరిగినట్లు తేలింది.

ఇదిలావుండగా మైఖేల్ వ్యక్తిగత వైద్యుడు ముర్రే కేవలం 11 రోజుల క్రితమే జాక్సన్ ఆరోగ్య పరిస్థితిని అదుపుతెచ్చేందుకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు మైఖేల్ మరణానికి ప్రధాన కారకుడు కార్డియాలిజిస్టేనంటూ కోర్టులో కేసు నమోదు చేసేందుకు జాక్సన్ కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి