జపాన్‌లో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

జపాన్ కేబినెట్‌పై అక్కడి ప్రతిపక్షం దిగువ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అధికారి పార్టీ నేతృత్వంలోని కూటమి ఈ అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించింది. అయితే ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం వీగిపోవడాన్ని కూడా ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.

వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో పాలకపక్షాన్ని ఓడించేందుకు ప్రతిపక్షం ఇప్పటికే పెద్దఎత్తున విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. పార్లమెంట్ దిగువ సభలో ప్రభుత్వంపై ప్రతిపక్షం తాజాగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ, దాని సంకీర్ణ భాగస్వామ్య పార్టీ సభ్యులు వ్యతిరేకించారు.

అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 333 మంది సభ్యులు ఓటేయగా, 139 మంది అనుకూలంగా ఓటు వేశారు. ప్రధానమంత్రి టారో అసో ప్రభుత్వాన్ని దించివేసేందుకు డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ ఈ అవిశ్వాస తీర్మానాన్ని దిగువ సభలో ప్రవేశపెట్టింది. గత వారాంతంలో జరిగిన టోక్యో మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ పరాజయం పాలైంది. ప్రతిపక్షం దీనిని ఓటరు సెంటిమెంట్‌కు కొలబద్దగా చేసుకొని ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

వెబ్దునియా పై చదవండి