తైవానులో భూకంపం: రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు

తైవానులో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. భౌగోళిక స్థితి నేపథ్యంలో తరచూ తైవాన్ భూకంపాల బారిన పడుతోంది. తాజాగా చోటుచేసుకున్న ఈ ప్రకృతి వైపరీత్యంలో ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. 1999లో సంభవించిన భూకంపంలో 2,400 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదు అయ్యింది. తాజాగా సంభవించిన భూకంపంతో తైవాన్ ప్రజలు భయభ్రాంతులయ్యారు.

వెబ్దునియా పై చదవండి