నేటి నుంచి దీపక్ కపూర్ అమెరికా పర్యటన

భారత ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ సోమవారం నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ అధికారిక పర్యటనలో దీపక్ కపూర్ అమెరికా మిలిటరీ సీనియర్ అధికారులు, పౌర రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమవతారు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్, అమెరికా ఆర్మీ స్టాఫ్ చీఫ్, అమెరికా సెంట్‌కామ్ కమాండర్ తదితరులతో దీపక్ కపూర్ సమావేశమవతారని అధికారిక వర్గాలు తెలిపాయి.

అమెరికా- భారత్ రక్షణ సహకారంపై ఇరుదేశాల ఉన్నతాధికారులు ఈ సందర్భంగా చర్చలు జరుపుతారు. సంయుక్త శిక్షణ, విన్యాసాలు, పరస్పర సర్దుబాట్లు, మిలిటరీ పరికరాల సహకారం తదితర అంశాలపై ప్రధానంగా చర్చలు సాగుతాయి. అమెరికా ఆఫ్ఘన్- పాక్ విధానం, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు కూడా ఇరుదేశాల రక్షణ శాఖ అధికారుల మధ్య చర్చకు రానున్నాయి. దీపక్ కపూర్ ఈ పర్యటనలో అమెరికాలోని కీలక శిక్షణా కేంద్రాలు, కార్యనిర్వాహక కేంద్రాలను కూడా సందర్శిస్తారు.

వెబ్దునియా పై చదవండి