పాక్‌లో ఆత్మాహుతి దాడి: 13 మంది మృతి

పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని పేషావర్‌లో ఓ మసీదు వద్దనున్న పోలీసు భద్రతా కార్యాలయంపై కారుతో తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 13 మంది మృతి చెందగా పలువురు తీవ్ర గాయాల పాలైనారు. శుక్రవారం జరిగిన ఈ దాడుల్లో దేశంలో జరిగిన అతి పెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.

ఈ దాడులు మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగాయని, ఇందులో పోలీసు భవంతితోపాటు చాలా వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించినట్లు స్థానిక టీవీ ఛానెళ్ళు తెలిపాయి.

గురువారం పేషావర్‌లోనే జరిగిన దాడుల్లో ప్రభుత్వ అధికారులు నివసించే కాలనీలో మరో పేలుడు జరిగింది. ఇందులో ఓ పిల్లవాడు మృతి చెందగా మరో 10 మంది తీవ్ర గాయాలపాలైనారని పోలీసులు తెలిపారు.

పేషావర్‌లో శుక్రవారం జరిగిన దాడుల్లో దాదాపు 13 మంది మృతి చెందగా పలువురు తీవ్ర గాయాల పాలైనట్లు స్థానిక టీవీ ఛానెళ్ళు పేర్కొన్నాయి. దీంతోపాటు పేలుళ్ళు జరిగిన ప్రాంతంలోనే స్థానిక మసీదు కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

ఇదిలావుండగా ఈ పేలుళ్ళకుగాను నలభై కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. ఒక వారం ముందు ఇదే పట్టణంలోని జనసమర్థం కలిగిన మార్కెట్లో ఓ వాహనం ద్వారా జరిపిన దాడుల్లోను దాదాపు 52 మంది మృతి చెందారు.

వెబ్దునియా పై చదవండి