పెద్ద బిడ్డలకు తండ్రిని నేనే: జాక్సన్ నైద్యుడు

పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ పిల్లల సంరక్షణ బాధ్యతల కోసం జరుగుతున్న పోరాటం కొత్త మలుపు తిరిగింది. లాస్ ఏంజెలెస్‌కు చెందిన ఓ చర్మవ్యాధి నిపుణుడు మైకేల్ జాక్సన్ మొదటి ఇద్దరు పిల్లలకు వాస్తవ తండ్రిని తానేనని వెల్లడించారు.

జాక్సన్‌కు గత 25 ఏళ్లుగా డెర్మటాలజిస్ట్‌గా పనిచేసిన ఆర్నాల్డ్ క్లెయిన్ అనే వైద్యుడు పాప్ కింగ్ పెద్ద పిల్లల సంరక్షణ బాధ్యతలు స్వీకరించేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్ మైకేల్ (12), పారిస్ (11)లు తన బిడ్డలేనని ఆర్నాల్డ్ క్లెయిన్ పేర్కొన్నారు.

వీరిద్దరి సంరక్షణ బాధ్యతల కోసం కోర్టును ఆశ్రయించేందుకు ఆర్నాల్డ్ తన లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సండే మిర్రర్ పత్రిక వెల్లడించింది. మైఖేల్ రెండో భార్య డెబ్బీతో ఆర్నాల్డ్‌కు కలిగిన బిడ్డలే ప్రిన్స్ మైకేల్, పారిస్‌‍లని, దీనిని నిరూపించగలమని ఆ వైద్యుడి సన్నిహితుడొకరు సండే మిర్రర్ పత్రికతో చెప్పారు.

వెబ్దునియా పై చదవండి