పెరుగుతున్న అల్ ఖైదా దాడులు: ఒబామా

ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ సరిహద్దుల్లో తాలిబాన్ తీవ్రవాద సంస్థ పునరుజ్జీవనం పొందుతోందని, అల్ ఖైదా తీవ్రవాదుల దాడులు పెరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ఈ ప్రాంతం వారికి స్వర్గధామంగా మారిందని ఒబామా అభిప్రాయపడ్డారు. విదేశాల్లో భద్రతా పరిస్థితిపై తక్షణమై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ సరిహద్దుల్లోని సురక్షిత స్థావరాల నుంచి తాలిబాన్‌లు పునరుజ్జీవనం పొందుతున్నారని, ఈ ప్రాంతాల నుంచి అల్ ఖైదా తీవ్రవాదులు చేస్తున్న దాడులు పెరుగుతున్నాయని అమెరికా అధ్యక్ష భవనం (వైట్‌హోస్) విడుదల చేసిన ఓ ప్రకటనలో ఒబామా పేర్కొన్నారు.

ఆఫ్ఘన్- పాక్ సరిహద్దు ప్రాంతంలో అల్ ఖైదా తీవ్రవాద సంస్థ మూలాలను ధ్వంసం చేసేందుకు నిధులు సమకూర్చే చట్టంపై బరాక్ ఒబామా సంతకం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో రాజకీయ, ఆర్థిక సుస్థిరతను నెలకొల్పేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఒబామా ఈ సందర్భంగా తెలిపారు.

వెబ్దునియా పై చదవండి