బెలూచిస్థాన్‌లో భారత్ జోక్యం: గిలానీ ఆరోపణ

FileFILE
పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ మరియు ఇతర ప్రాంతాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని పాక్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ ఆరోపించారు. ఈజిప్ట్‌లో భారత్-పాకిస్థాన్‌ల వివాదస్పద సంయుక్త ప్రకటన వెలువడిన రెండు రోజుల అనంతరం.. గిలానీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

షర్మ్-ఎల్ షేక్ నుండి తిరిగి వచ్చిన సందర్భంగా విలేకరులతో గిలానీ మాట్లాడుతూ, పాక్‌లోని బెలూచిస్థాన్ మరియు ఆదేశ ఇతర ప్రాంతాల్లో భారత్ జోక్యం చేసుకోవడం తమను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. అయితే భారత్, పాక్‌ల మధ్య చర్చలు మళ్లీ జరిగే భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకరించడంపై హర్షం వ్యక్తం చేశారు.

మన్మోహన్‌లో రాజనీతి, రాజకీయ చతురత మెండుగా ఉన్నాయని గిలానీ ప్రశంసించారు. ఈజిప్ట్‌లో ఇరు దేశాల సంయుక్త ప్రకటనలో బెలూస్థాన్‌ అంశంపై.. భారత్‌లో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించడాన్ని ప్రస్తావించారు. దీనికి సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని గిలానీ స్పష్టం చేశారు.

దీని గురుంచి త్వరలో ఇరు దేశాల మధ్య జరిగే చర్చల్లో కీలకంగా ప్రస్తావిస్తామన్నారు. అదలా ఉంచితే.. ఇరు దేశాల సంయుక్త ప్రకటనలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదని వస్తున్న వార్తలను గిలా ఖండించారు. పాక్‌తో చర్చలు తిరిగి పునరుద్ధరించాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోందనే వార్తల్లో నిజం లేదన్నారు.

వెబ్దునియా పై చదవండి