మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కారణంగా జరిగే మారణ హోమాలకు ప్రసిద్ధిగాంచిన పట్టణం రియో డీ జెనేరియోలోని ఐదు ఆసుపత్రులను బుల్లెట్ ప్రూఫ్ ఆసుపత్రులుగా తయారు చేయనున్నారు.
ప్రమాదకరమైన ప్రాంతాలలోనున్న ఈ ఆసుపత్రులలోని భవంతులకు నలువైపులా కాంక్రీట్‌తో కాంపౌండ్‌వాల్ కట్టి కిటికీలకు ఇనుప షట్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. ఇవి తుపాకీ గుండ్లను నిరోధించేవిధంగా ఉంటాయని వారు అన్నారు.
ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తాము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని ఆసుపత్రుల ప్రాంతీయ డైరెక్టర్ ఆస్కార్ బేరో అన్నారు. ఆసుపత్రుల పునర్నిర్మాణం చేసేందుకు తాము దాదాపు 25 కోట్ల డాలర్లను ఖర్చు చేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందించామని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల బయటి వ్యక్తులు గత వారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిపై జరిపిన కాల్పుల్లో ఆసుపత్రిలోని ఎక్స్‌రే స్లైడ్లకోసం ఉపయోగించే ఓ యంత్రం పాడైపోయిందని ఆయన తెలిపారు.